Daily Archives: 21 May 2025

బీరన్న పెద్ద పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

దేవతామర్తులకు అభిషేకాలు చేసిన గొల్ల, కురుమలు తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో గొల్ల, కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బీరన్న పూజారుల వేషధారణ డప్పుచప్పులు నృత్యాలతో గొల్ల కురుమ కులస్తులు, మహిళలు భారీ ర్యాలీగా బీరన్న దేవాలయానికి బుధవారం చేరుకున్నారు. బీరన్న దేవాలయంలో పూజల అనంతరం గ్రామంలోని పోచమ్మ, మాoకాలమ్మ, వెంకటేశ్వర శివాలయం, భూలక్ష్మి-మా లక్ష్మి, పెద్దమ్మతల్లి, మడెలయ్య, ఎల్లమ్మ దేవాలయాల్లో దేవతామూర్తులకు పాలాభిషేకం, …

Read More »

జమ్మికుంట పట్టణ సీఐని కలిసిన కరీంనగర్‌ జిల్లా సంఘం కమిటీ

తెలంగాణఅక్షరం-జమ్మికుంట ఇటీవల పోలీస్‌ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగరతో పాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతలో పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కుర్మిండ్ల అశోక్‌ కుమార్‌ సగర, బొడిపెల్లి సదానందం సగర తదితరులు పాల్గొన్నారు.

Read More »

నీరుగారనున్న లక్ష్యం… ”దూరం” కానున్న అంగన్వాడీ సేవలు!

కేంద్రాల తరలింపుపై అధికార యంత్రాంగం చర్యలు గగనకుసుమంగా అందుబాటులో ప్రభుత్వ భవనాలు లబ్ధిదారులకు సేవలు అందటంపై అనుమానాలు గర్భిణీలు, బాలింతలు పోషకాహారానికి దూరమయ్యే అవకాశాలు ఖర్చుల తగ్గింపుకోసం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులు, మహిళలు, …

Read More »