తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో కురుమ, గొల్ల కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు గొల్ల, కురుమ కులస్తులు అమ్మవారిని సమర్పించారు. ఒగ్గు పూజారిలొచ్చే ఒగ్గు డోల తో నృత్యాలతో గొల్ల, కురుమ కులస్తులు మహిళలు పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కురుమ కులస్తులు పాల్గొన్నారు.
Read More »Daily Archives: 23 May 2025
బోర్నపల్లి గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం కార్యవర్గం ఎన్నిక
తెలంగాణఅక్షరం-హుజురాబాద్ హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేశ బోయిన ఓదెలు ప్రధాన కార్యదర్శిగా కేశ బోయిన అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కేశవైన లింగయ్య ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా నాని, రమేష్, మేడుదుల రాజు, కేశ బోయిన కేతమ్మ, గుంపుల రాజమ్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సాయంత్రం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను సంఘ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
Read More »నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
తెలంగాణఅక్షరం-పెద్దపల్లి జిల్లాలో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు వికయిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో విత్తనాల విక్రయంలో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం …
Read More »Strict action | నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. శిక్షణ ఎస్సై సాయికృష్ణ
తెలంగాణఅక్షరం-వీణవంక Strict action | ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శిక్షణ ఎస్సై సాయికృష్ణ విత్తన డీలర్లను హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపుల యజమానులతో ఏఓ గణేష్ తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మకూడదని, గుర్తుతెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమినాశకాలు అమ్మకూడదని సూచించారు. పురుగు మందులు అమ్మేటపుడు రైతు ఆధార్ కార్డు, పాస్ బుక్ జీరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. …
Read More »