తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వ సుజాత , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి,జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షునిగా వాస శ్రీనివాసులు గుప్త, కార్యదర్శిగా దారం ఇంద్రసేన గుప్త, కోశాధికారిగా సోమిశెట్టి పవన్ కుమార్ గుప్త,వర్కింగ్ ప్రెసిడెంట్గా తెరల శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యక్షులు, సలహాదారులు సహా కార్యదర్శులు, సహా కోశాధికారులు,కమిటీ …
Read More »Monthly Archives: June 2025
ఇన్స్‌పెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు
వాస్తవం, బాలాపూర్ :ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నూతన ఇన్స్‌పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మద్ది మహేందర్ రెడ్డి బడంగ్పేట్ బిఆర్ ఎస్ నేతలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మహేందరరెడ్డికి పూల బొకే, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మేళ పవన్ కుమార్,పార్టీ నాయకులు అరుణ్ ఉన్నారు.
Read More »కమిషనర్ పద్ధతి మార్చుకోవాలి
కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకుంటే ఆందోళన చేస్తాం భారతీయ జనతా పార్టీ హెచ్చరిక తెలంగాణఅక్షరం, బాలాపూర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కమిషనర్ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పనులు నాణ్యతగా జరగకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం బిజెపి నాయకులు సమావేశంలో మాట్లాడుతూ, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, టెండర్లను గోపియంగా ఉంచి అధికార పార్టీ నాయకులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు …
Read More »ఘనంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :జన్మదినం సందర్భంగా గాజులరామారంలోని చిత్తరమ్మ దేవి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కూన రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గాజులరామారం డివిజన్, సూరారం డివిజన్, షాపూర్ …
Read More »కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం నియామకం
35 మంది కార్యవర్గ సభ్యులతో పూర్తి కమిటీని ప్రకటించిన కొంపల్లి అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్సమావేశ ముఖ్య అతిథులుగా జిల్లా హాజరైన ప్రధానకార్యదర్శి గిరివర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డితెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :సంఘటన సంరచన కార్యక్రమంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ అధ్యక్షతన మున్సిపాలిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు సరిత రావు, ఎన్నికల ప్రభారి ప్రీతం రెడ్డి, …
Read More »రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 న BMS ధర్నా
BMS కార్యకర్తలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్ పిలుపు తెలంగాణఅక్షరం-కరీంనగర్ ప్రజాస్వామ్యంలో కార్మికుల యొక్క హక్కులను కాల రాస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కి నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు BMS రాష్ర్ట ఉపాధ్యక్షుడు పప్పుల సురేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన తెలపడంతో కలెక్టర్ ద్వారా సీఎంకు మెమోరాండం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల …
Read More »పర్యావరణ రక్షణ దిశగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి – ఈటల రాజేందర్
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు వెంకటేశ్వర కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మొక్కలు నాటరు. కొంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రక్షణ దిశగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు …
Read More »ఘనంగా శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం బాలాజీ లేఔట్ లో శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో అర్చకుల వేద మంత్రాలు, మేళ తాళాల మధ్య దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహంతో పాటు నందీశ్వరుడు, గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు. ఉదయం నుంచే భక్తులు విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య …
Read More »ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భౌగోళికంగా తెలంగాణ సాధించాం..అమరుల ఆశయాల తెలంగాణ ఇంకా కలగానే ఉంది – పెద్దబుద్దుల సతీష్ సాగర్తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని కొంపల్లి మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ముఖ్య అతిధి, జిల్లా ఉపాధ్యక్షులు రాజి రెడ్డి మాట్లాడుతూ అనేక మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలకు సరైన గుర్తింపు గుర్తింపు లేదని, ప్రభుత్వం …
Read More »హిందువుల ఇండ్ల మధ్యలో చర్చి నిర్మాణాలును తొలగించాలి
బీజేపీ బడంగ్పేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణఅక్షరం-బాలాపూర్ హిందువుల ఇండ్ల మధ్యలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్న చర్చి నిర్మాణాలను తొలగించాలని బడంగ్పేట్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణాలు చేపట్టారని, ఒకచోట రోడ్డును కబ్జా చేసి చర్చిని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు …
Read More »