తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో భీమేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండలం కాలం పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం లక్ష్మీ గణపతి మూల తంత్ర సహిత రుద్ర హోమం చేశారు. పూర్ణ హారతి, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
Read More »