Daily Archives: 20 July 2025

అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

తెలంగాణ అక్షరం- కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేకంగా అలంకరించుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ వీధులన్నీ బోనాల ఊరేగింపులతో మారుమ్రోగాయి. తాళం, డప్పులతో, పల్లకీతో అమ్మవారిని ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు గ్రామ ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి. గ్రామస్థుల సహకారంతో ఎంతో సాంప్రదాయబద్ధంగా, శ్రద్ధతో బోనాల ఉత్సవం నిర్వహించడాన్ని అందరూ ప్రశంసించారు.

Read More »

బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు

తెలంగాణ అక్షరం- కుత్బుల్లాపూర్ :బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆకుల సతీష్ ఆధ్వర్యంలో వివిధ కాలనీలలో అమ్మవారి గుడులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, రాష్ట్రానికి సమృద్ధి మరియు శాంతి చేకూరాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్‌తో ,నల్ల జై శంకర్ గౌడ్, పులి బలరాం, చందు, లానా, ముఖేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Read More »