Monthly Archives: July 2025

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరిక తెలంగాణఅక్షరం-వీణవంక మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు. మండల పరిధిలోని కొండపాక, చల్లూరు గ్రామాల్లో మానేరు తీరం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లూరు చెందిన దామెర నర్సయ్య, కొండపాకకు చెందిన సల్పల సమ్మయ్య ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా వారిపై కేసు నమోదు …

Read More »

కాకతీయ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.. : బీఆర్‌ఎస్‌వీ నాయకుడు వొల్లాల శ్రీకాంత్‌ గౌడ్‌

తెలంగాణఅక్షరం-వీణవంక జమ్మికుంట పట్టణంలోని కాకతీయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌వీ సీనియర్‌ నాయకుడు వొల్లాల శ్రీకాంత్‌ గౌడ్ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌ గౌడ్‌ మాట్లాడారు. వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీబీఎస్సీ కాకతీయ విద్యాసంస్థల బస్సు నడిరోడ్డుపై మూడు రోజుల నుండి ఉంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులు …

Read More »

పూర్వ విద్యార్థుల ఔదార్యం… ఏవివి పాఠశాల అభివృద్ధికి విరాళం

తెలంగాణ అక్షరం- వరంగల్:వరంగల్ లోని ఏవివి పాఠశాలలో 2002-03కు చెందిన విద్యార్థులు ఇటీవల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కొరకు తమ వంతు సాయం అందజేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం రోజు ప్రధానాచార్యులు , ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల అభివృద్ధి కొరకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ విద్యార్థుల సద్భావన పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, పూర్వ విద్యార్థుల ఔదార్యం ప్రస్తుతం …

Read More »

పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటాలి… అందెల

తెలంగాణ అక్షరం-బాలాపూర్ :పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు విరివిగా నాటాలని భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. అమ్మ చెట్టు కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల పరిధిలోని అల్మాస్గూడ లో చెట్లు నాట కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంటి ముందు విధిగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతోపాటు పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవచ్చు అన్నారు. విద్యార్థి దశలోనే మొక్కల పెంపకంపై …

Read More »

ఎంపీ ఈటెలను కలిసిన…. మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ

తెలంగాణ అక్షరం-బాలాపూర్ :మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇటీవల నియామకం అయ్యింది. ఈనెల 6న వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంటు సుమన్, సహాయ కోశాధికారి గుడుమల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల లక్ష్మణ్ లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసారు.

Read More »

మహేంద్ర సంఘం రాష్ట్ర కమిటీ లో గోవర్ధన్ కు చోటు

తెలంగాణ అక్షరం-బాలాపూర్ :తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో బాలాపూరకు చెందిన పిల్లి గోవర్ధన్ కు చోటు దక్కింది. బాలాపూర్ కు చెందిన గోవర్ధన్ మండల ప్రచార కార్యదర్శి గా, నగరం ( నిజామాబాద్ జిల్లా) అధ్యక్షలుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని …

Read More »

ఘనంగా మాజీ సీఎం రోశయ్య 92వ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐడిపిఎల్ చౌరస్తా లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్డికాపూల్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ అధ్యక్షులు పార్శి ప్రకాష్ గుప్త, మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులు గుప్త, తెరాల శ్రీనివాస్ గుప్త, పవన్ గుప్త, విజయ గుప్త, ఆకుల ప్రభాకర్ గుప్త, భిక్షపతి …

Read More »

‘అందెల’ ఇంటిముందు రోహింగ్యాల రెక్కి!

రోహింగ్యాల వాహనంలో పెట్రోల్, కట్టర్, సత్తే, ఐరన్ రాడ్ ల లభ్యం….పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు తెలంగాణ అక్షరం – బాలాపూర్ :భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటిముందు ఆరుగురు రోహింగ్యలు అనుమానాస్పదంగా శుక్రవారం రెక్కి నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యలు బాలాపూర్ మండల పరిధిలోని డైమండ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో, కొత్తపేట శివారులో, చంద్రయన్ గుట్ట సమీపంలో అక్రమంగా నివాసం ఉంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో …

Read More »

నూతన నియామకం

తెలంగాణ అక్షరం – బాలాపూర్:తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో యళమల శ్రీనివాస్ కు చోటు దక్కింది. హస్తినాపూర్ కు చెందిన శ్రీనివాస్ కు హస్తకళల విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.

Read More »

బిజెపి నూతన అధ్యక్షుని కలిసిన కొంపల్లి నాయకులు

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రామచందర్ రావుని తార్నాకలోని నివాసంలో కొంపల్లి బిజెపి నాయకులు కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్దన్ రెడ్డి మరియు విగ్నేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత, అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, కోకన్వినర్ శివాజీ రాజు , జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్, కొంపల్లి …

Read More »