Monthly Archives: August 2025

ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్న కొంపల్లి బీజేపీ నాయకులు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:సమస్యలు పరిష్కరించాలని ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ బిజెపి నాయకులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే నగరంలోని బిజెపి నాయకులను కార్యకర్తలను, కార్పోరేటర్లను గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని సచివాలయం ముట్టడికి కొంపల్లి బిజెపి నాయకులు తరలి వెళ్లారు. సెక్రటేరియట్ గేట్ల వద్దకు చేరుకున్న కొంపల్లి బిజెపి నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి …

Read More »

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి , దూలపల్లి ప్రాంతాలలో ఉన్న స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజిరెడ్డి, శివాజీ రాజు, సరిత రావు , సతీష్ మాట్లాడుతూ స్మశాన వాటికలో కనీస అవసరాల లేని కారణంగా ఎవరైనా చనిపోతే అంతక్రియలు చేయడానికి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు బొల్లారం, అల్వాల్ ప్రాంతాలలో ఉన్న వైకుంఠధామాలకు పార్థివ దేహాలను తీసుక వెళ్లి …

Read More »

వీణవంక తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుపమ

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక తహసీల్దార్‌గా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో గంగాధర మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రజిత గంగాధరకు బదిలీ అయ్యారు. కాగా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా డిప్యూటీ తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఆర్‌ఐలు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Read More »

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం దివంగిత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్ర ఫోటోకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూవి ద్య, వైద్య రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాజీవ్ గాంధీ ఎనలేని …

Read More »

పైప్ లైన్ రోడ్ లోని నాలాపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్ లో స్టీల్ వంతెను నిర్మించాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆకుల సతీష్ సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ రోడ్ నుంచి నేషనల్ హైవే కి అనుసంధానం చేస్తూ 3.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన రహదారిలో పరిశ్రమలు ఉండడంతో భారీ వాహనాలను రవాణా కోసం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వంతెనపై వాహనాల రాకపోవకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ …

Read More »

మహిళా హోంగార్డుకు ప్రతిభా ప్రశంసాపత్రం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించి మెరుగైన సేవలు అందించే ఉద్యోగులకు అందజేసే ప్రతిభా ప్రశంసాపత్రంకు వీణవంక పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు ఉమాదేవి ఎంపికైంది. కాగా కరీంనగర్‌లోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ ప్రమేల సత్పతి, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఉమాదేవికి ప్రతిభా ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఆవుల తిరుపతి, ఏఎస్సై వెంకట్‌రెడ్డితో పాటు సిబ్బంది ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ …

Read More »

కొంపల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కొంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయతను చాటేందుకు ముందుకు రావాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పట్టుకుని విద్యార్థులు, ప్రజలు భారత్ మాతాకీ జై అంటూ దేశభక్తి ఉప్పొంగేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు …

Read More »