Daily Archives: 22 August 2025

ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్న కొంపల్లి బీజేపీ నాయకులు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:సమస్యలు పరిష్కరించాలని ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ బిజెపి నాయకులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే నగరంలోని బిజెపి నాయకులను కార్యకర్తలను, కార్పోరేటర్లను గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని సచివాలయం ముట్టడికి కొంపల్లి బిజెపి నాయకులు తరలి వెళ్లారు. సెక్రటేరియట్ గేట్ల వద్దకు చేరుకున్న కొంపల్లి బిజెపి నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి …

Read More »

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి , దూలపల్లి ప్రాంతాలలో ఉన్న స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజిరెడ్డి, శివాజీ రాజు, సరిత రావు , సతీష్ మాట్లాడుతూ స్మశాన వాటికలో కనీస అవసరాల లేని కారణంగా ఎవరైనా చనిపోతే అంతక్రియలు చేయడానికి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు బొల్లారం, అల్వాల్ ప్రాంతాలలో ఉన్న వైకుంఠధామాలకు పార్థివ దేహాలను తీసుక వెళ్లి …

Read More »

వీణవంక తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుపమ

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక తహసీల్దార్‌గా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో గంగాధర మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రజిత గంగాధరకు బదిలీ అయ్యారు. కాగా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా డిప్యూటీ తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఆర్‌ఐలు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Read More »