సహస్ర శ్రీకి పలువురి అభినందన
తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రానికి చెందిన బత్తిని సహస్ర శ్రీకి గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. సహస్ర శ్రీ తన మిత్ర బృందంతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌళి స్టేడియంలో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు. ఈ కాగా ఈ పోటీల్లో 6000 మంది కళాకారులతో కలిసి సుమారు ఏడు నిముషాల పాటు సహస్ర శ్రీ నృత్యం చేసింది. ఈ పోటీలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఈ నృత్య పోటీల్లో పాల్గొన్న వీరి కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్ కు ఎంపిక అయినట్లు పర్యవేక్షకుడు రిషినాథ్ తెలిపి వీరి బృందానికి ధ్రువీకరణ పత్రాన్ని బారత్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు కేవీ రమణారావు, అధ్యక్షురాలు లలితకు అందజేశారు. కాగా బత్తిని సహస్ర శ్రీ ని మండలానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు అభినందించారు.