తెలంగాణ అక్షరం-కరీంనగర్
తెలంగాణ బిసి ఉద్యోగుల సంఘo రాష్ట్ర కార్యదర్శిగా నాగారపు శ్రీనివాస్ నియమితులయ్యారు. సోమవారం కరీంనగర్ తిరుమల నగర్ లో ఉమ్మడి జిల్లా బిసి ఉద్యోగుల సంఘ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీనివాస్ యాదవ్ హాజరై నాగారపు శ్రీనివాస్ ని రాష్ట్ర కార్యదర్శిగా నియామిస్తు నియామక పత్రాలు అందజేశారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీనివాస్ యాదవ్ మరియు తోటి ఉద్యోగ సంఘ నాయకులకునాగారపు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. సంఘ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు, శాయ శక్తుల పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.