తెలంగాణఅక్షరం-హైదరాబాద్
మరో హామీ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై సీఎం రేవంత్ ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు సమాచారం.
Please follow and like us: