తెలంగాణ అక్షరం-వీణవంక
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాన్నమనేని రంగారావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలలలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించాలని, పదోన్నతులు వద్దనుకునే వారి నుండి అంగీకారం తీసుకున్న తర్వాతనే పదోన్నతులు కల్పించాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వం వెంటనే పీఆర్ సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ బాధ్యులు పోలు సత్యనారాయణ, కట్కోజ్వల రవి కిరణ్, పోలాడి సత్యనారాయణ రావు, ఓదెల శివకుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.