తెలంగాణఅక్షరం-నాగర్ కర్నూల్ బ్యూరో
నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలము జంగమోనిపల్లి గ్రామ లో కాంగ్రెస్ ప్రచారం ముంబరంగ కొనసాగింది. గ్రామంలోని యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామము నుండి స్టేజి వరకు ట్రాక్టర్లు బైకులతో కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతూ ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూచుకుల్ల రాజేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే రాముడు ఆధ్వర్యంలో ర్యాలీగా గ్రామానికి వెళ్లి డప్పు చప్పులతో ఎంతో ఉత్సాహంగా ఎడ్ల బండి పై వారి ర్యాలీగా గ్రామానికి తీసుకువెళ్లారు . గ్రామంలో వీధుల గుండా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అనుకున్న ప్రకారం ప్రజలకు అన్ని విధాల ఆదుకుంటానని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ హాయంలో జరిగిందని ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరు జడ్పిటిసి, నాగర్కర్నూల్ వైస్ ఎంపీపీ, నాయకులు వెంకటాయ గౌడు, బిచ్చిరెడ్డి .నిరంజన్ ,బాల గౌడు ,నరేందర్, శివారెడ్డి ,శ్రీను, ప్రకాష్, తదితరులు యువకులు మహిళలు పాల్గొన్నారు.