తెలంగాణఅక్షరం- మథని ప్రతినిధి
మంథని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, పలు అగ్రకుల నేతల పార్టీల దిష్టిబొమ్మను ధర్మ సమాజ్ పార్టీ ప్రతిపాదిత ఎమ్మెల్యే అభ్యర్థి చిట్యాల శ్రీనివాస్ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శాతం లేని అగ్రకులాలకు నాయకత్వం వహించే అర్హత లేదని, తక్షణమే అగ్రకుల నేతలు తమ అధినేత పదవికి రాజీనామా చేసి పార్టీ అధినేతగా బహుజన కులానికి చెందిన వ్యక్తిని నియమించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రతిపాదించాలని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ డిఎస్పి పార్టీ నాయకులు కోరాళ్ల శ్యామ్, పేట మహేష్, రవీందర్, శ్రీకాంత్, రమేష్ , పులి రాజు, శ్రీధర్, ప్రణీత్ సుశాంత్, నవీన్, మహేష్ తదితరులు ఉన్నారు.