ఏకశిల లో మట్టి గణపతి విగ్రహల ఫై అవగాహన ర్యాలి
తెలంగాణ అక్షరం-హన్మకొండ
రెడ్డి కాలనీలోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు మట్టి గణపతుల ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన ర్యాలి నిర్వహించారు.ఈ సంధర్బంగాఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..రాబోయే వినాయక చవితి కి మట్టి విగ్రహాలను పూజించాలని,పర్యావరణానికి హాని జరగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాద్యత కూడా తెలిసే విదంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రసాయనాలు వాతావరణాన్ని,నీటిని కలుషితం చేస్తాయని,కావున రసాయనాలతో కూడిన విగ్రహాలను కాకుండా మట్టిగణపతి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని రక్షిద్దాం… మట్టి గణపతులనే పూజిద్దామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్,గోపాల్ రెడ్డి, స్వామి, పవన్,హరినాథ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.