రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు
తెలంగాణఅక్షరం-వరంగల్
WARDANNAPETA | రంజాన్ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్-గా-గుల్షన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ మానవ సేవ, సోదరభావానికి ప్రతీక అని, ఉపవాసాలు, ప్రార్థనలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తన బాల్యం ఇదే ప్రాంతంలో గడచిందని, హాకీ ఆటగాడిగా అంతర్జాతీయ గుర్తింపు పొంది, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని పంచుకుంటూ, తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్, అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.