ఎమ్మెల్యే నన్నపనేని నివాసంలో ఘనంగా వినాయకచవితి వేడుకలు
తెలంగాణ అక్షరం-వరంగల్
గణేషుని ఆశీర్వాదంతో ప్రజలంతా బాగుండాలని ఆ గణేషుడిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు..ఈ రోజు వినాయక చవితి సందర్బంగా శివనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో కుటుంబసమేతంగా వినాయకున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..తన సతీమణి వాణి,కుమారులు లోకేష్ పటేల్, మన్ ప్రీత్ పటేల్, కార్యాలయం సిబ్బంది నడుమ ఈ పూజలు నిర్వహించారు. సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో రాష్ట్రం,నియోజకవర్గం అద్బుతంగా అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు..ఆ గణేషుని ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,మంత్రి కే.టీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం నియోజకవర్గం మరింత ప్రగతిలో వేగంగా ముందుకు సాగాలని,ప్రజలంతా భక్తి శ్రద్దలతో గణేషుని పూజించాలని,సంబరంగా నవరాత్రులు జరుపుకోవాలన్నారు.ప్రజలందరికి ఎమ్మెల్యే వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.