సినీ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య

తెలంగాణ-అక్షరం,చెన్నై తమిళనాడు

బిచ్చగాడు ఫేమ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె లారా (16) ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద వార్త తో కోలీవుడ్​, టాలీవుడ్ ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగింది. సక్సెస్ ఫుల్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్​ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని సమాచారం అందింది. దీంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు.. లారాకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *