ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణఅక్షరం-హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం కేసి క్యాంపులోని మహాత్మ జ్యోతి బాపూలె బాలికల పాఠశాలలో కల్తి ఆహారం తిని ఆరుగురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరందరిని ఎమర్జన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇందులో హారిక అనే విద్యార్థినికి అస్తమా రావడంతో ఆక్సిజన్ పెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భయంతోనే విద్యార్థులు అస్వస్తతకు గురైనట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు.విద్యార్థినిలను పాఠశాల టీచర్స్, ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థినిలలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని హన్మకొండ లోని ప్రయివేట్ హాస్పిటల్ కు వైద్యుల సూచనల మేరకు తరలించారు.