తెలంగాణ అక్షరం- హన్మకొండ
రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ) హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్- 2023లో పాల్గొన్న ఏకశిలా విద్యార్థిని పి. హన్సిక ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సంపాదించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్. మాధవి గైడ్ టీచరుగా వ్యవహరించిన “Millets-A Super Food or a Diet Fad”? ( సిరి ధాన్యాలు సంపూర్ణ ఆహరమా లేదా ఆహార వ్యమోహమా) అనే అంశంపై ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థిని జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఏకశిలా విద్యా సంస్థల విద్యార్థులు ఏ రంగాలలో నైపుణ్యం కలిగి ఉన్నారో గుర్తించి, వారికీ దానికి కావలసిన వనరులను కల్పించి, వారిని అత్యుత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వలన పలుపోటీలలో ఉన్నత విజయాలు అనుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులను విద్యతోపాటు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో ఏకశిలా విద్యాసంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 50 కి పైగా విద్యార్థిని విద్యార్థులు పలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారని ఇది ఏకశిలా విద్యాసంస్థలకు ఎంతో గర్వకారణం అని తెలిపారు. అంతేకాక తల్లి తండ్రులు తమపిల్లల భవిష్యత్తు పై పెట్టుకునన్న కలలను నేరవర్చి జాతి గర్వించదగ్గ పౌరులుగా , భావిభారత నిర్మాత లుగా తీర్చిదిద్దడంలోో ఏకశిల విద్య సంస్థల కృషి ఎనలేనిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ గౌరుు సుజారెడ్డి , వైస్ ప్రిన్సిపల్ కే.డి. స్వర్ణరాజ్ , గైడ్ టీచర్ మాధవి, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు రాంప్రసాద్ జోసఫ్, సలావుద్దీన్ రసజ్ఞ, ప్రియాంక లు పాల్గొన్నారు.