తెలంగాణఅక్షరం-వరంగల్ క్రైమ్
వరంగల్ పోలీస్ కమిషనర్లో విధులు నిర్వహిస్తున్న అదనపు డిసిపి సంజీవ్తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఎసిపి యం.జితేందర్ రెడ్డి త్వరలో జరగబోయే ఆలియాండియా పోలీస్ బ్యాట్మెంట్ పోటీలకు అర్హత సాధించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ బ్యాట్మెంటన్ క్రీడల్లో అదనపు డిసిపి సంజీవ్, ఏసిపి జితేందర్ రెడ్డి యాబై సంవత్సరాల డబుల్స్ విభాగంలో ఫైనల్స్లో విజయం సాధించి ఆలిండియా పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఇరువురు పోలీసు అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ బుధవారం అభినందించడంతో పాటు రాబోవు అలిండియా పోటీల్లో విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
Please follow and like us: