ఎరువుల దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేసిన హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
తెలంగాణఅక్షరం -హనుమకొండ
కాజీపేట లో ఎరువుల దుకాణంను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను,స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు,స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అనుమతుల్లేని నాసిరకం ఎరువులు విత్తనాలు,పురుగుమందులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని అన్నారు.డిఎపిని అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.రైతులకు విక్రయించిన ఉత్పత్తులకు సంబంధించి నగదు బిల్లులు ఇవ్వాలన్నారు. దుకాణాల్లో లైసెన్స్ కనపడేలా ప్రదర్శించాలన్నారు.
Please follow and like us: