పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
పీఏసీఎస్ లో సిబ్బందిగా పనిచేసిన రాజమల్లు సేవలు మరువలేనివని పీఏసీఎస్ చైర్మన్ మావరుపు విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సొసైటీలో పనిచేస్తున్న మ్యాకల రాజమల్లు ఇటీవల రిటైర్డ్ అయ్యారు. కాగా ఆయనకు శుక్రవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు రాజమల్లు-యాదమ్మ దంపతులను పూలమాలతో సన్మానించి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాజమల్లు సుధీర్ఘంగా పనిచేసిన అనుభవంతో సొసైటీలో తప్పిదాలు చోటుచేసుకోకుండా సూచనలు చేసేవారని, ఆయన నిజాయితీ, నిబద్దతతో పని చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో చందుపట్ల ప్రకాశ్ రెడ్డి, ఎంపీటీసీలో ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, రెడ్డిపల్లి ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మీభూమయ్య, సర్పంచులు పోతుల నర్సయ్య, బండారి ముత్తయ్య, గంగాడి సౌజన్యతిరుపతిరెడ్డి, మర్రి లక్ష్మీ స్వామి యాదవ్, పాలక వర్గ సభ్యులు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, రాములు, గెల్లు మల్లయ్య, శ్యాంసుందర్ రెడ్డి, తిరుమల్ నాయకులు చింతల శ్యాంసుందర్ రెడ్డి, సాహెబ్ హుస్సెన్ తదితరులు పాల్గొన్నారు.