తెలంగాణఅక్షరం-వీణవంక
ఓ యువతిని వేధింపులకు గురిచేసిన మండల కేంద్రానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అన్వర్ పాషా అనే ఆర్ఎంపీ క్లీనిక్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్నాడు. కాగా గత సంవత్సరం క్రితం శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవివాహిత యువతి అతడి వద్ద కొంత కాలం పాటు పని చేసి మానేసింది. అయితే ఇటీవల మళ్లీ తన వద్ద పని చేయాలని ఆ యువతిపై ఒత్తడి పెంచుతూ తనకు సహకరించాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా బాధితురాలు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా అన్వర్ పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Please follow and like us: