తెలంగాణ అక్షరం-వీణవంక
ఈవీఎంలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రెడ్డిపల్లి క్లస్టర్ ఏఈవో చందా రాకేష్ పటేల్ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి, కోర్కల్, దేశాయిపల్లి గ్రామాల్లో సోమవారం ఈవీఎంలపై ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం మిషన్ మనం ఓటు వేసే క్రమంలో సక్రమంగా ఓటు పడిందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఆ ఓటు వీవీ ప్యాడ్ ల ద్వారా మనం వేసిన ఓటు పడిందో లేదో తప్పకుండా చూసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ తిరుపతి, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: