వీణవంక మండలంలో పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి సుడిగాలి పర్యటన
తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, ఎల్బాక, గంగారం, చల్లూరుతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. అన్ని గ్రామాల్లో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ మండపాల కమిటీలకు రూ.5వేల చందా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.