తెలంగాణఅక్షరం-హనుమకొండ
: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 56వ డివిజన్, సప్తగిరి కాలనీ లో మంగళవారం రోజున శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి కమిటీ అధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు.శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి కమిటీ అధ్వర్యంలో కొలువుదీరి పూజలందుకుంటున్న గణనాధునికి నైవేద్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుకూలంగా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. సప్తగిరి కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి కమిటీ సభ్యులు బొల్లా శ్రీకాంత్, సీసీ, బైరు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ఫైనాన్షియర్, నిర్వాహకులు ఉమా మహేశ్వర్, ముప్పు కృష్ణ, రోకుల సందీప్, పి.కిరణ్ కుమార్, జె.రాకేష్, రాజు, బి.వాలు నాయక్, బాలాజీ, వినయ్ కుమార్, కుమార్ తదితరులు వేలాది భక్తులు పాల్గొన్నారు.