సర్వాయి పేటలోని పాపన్న గుట్టలను కాపాడాలి
హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు గీత కార్మికులు తరలిరావాలి
తెలంగాణఅక్షరం-వీణవంక
సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో ఉన్న పాపన్న గుట్టల నుండి ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాల అనుమతిని నిరసిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించే ధర్నా కార్యక్రమానికి గీతా కార్మికుల అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ సంఘం మండల అధ్యక్షులు బొంగుని రాజయ్య దొమ్మటి రాయమల్లు కోరారు. మండల కేంద్రంలోని ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ ప్రభుత్వం చారిత్రాత్మక కట్టడాలను కాపాడాల్సింది పోయి సంపదను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్న కుట్ర దారులకు ప్రభుత్వం వంత పాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగోని రాజయ్య, జిల్లా కార్యదర్శి కొమురయ్య, పాపన్న గౌడ, గీత కార్మిక సంగం కమిటీ సభ్యులు బొంగోని రాయమల్లు, పూదరి వీరేశంగౌడ్, మద్ది తిరుపతి గౌడ్, బొంగోని విరేశం గౌడ్, నల్లగొని రమేష్ గౌడ్, బత్తిని నరేష్ గౌడ్, వడ్లకొండ చిరంజీవి గౌడ్, ఎల్లా గౌడ్, పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్, గట్టు రాయమల్లు గౌడ్, బొంగోని సదానందం, మొగిలి గౌడ్ బుర్ర సంపత్ గౌడ్ , పొన్నం కొండాల్ గౌడ్, ఉయ్యాల రాజు గౌడ్, చర్లపెళ్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.