సామాజిక న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం కోసం పోరాడాలి

 

తెలంగాణ అక్షరం -హనుమకొండ :                 సామాజిక న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం కోసం పోరాడాలని సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షులు దామేరుప్పుల శంకర్ అన్నారు.

హన్మకొండ జిల్లా కేంద్రం లో సామాజిక న్యాయవేదిక జిల్లా సమావేశానికి జిల్లా అధ్యక్షులు దామేరుప్పుల శంకర్ శాలివాహన అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలలో చదివే విద్యార్థులకు కేజీ నుండి 10 తరగతి వరకు స్కాలర్ షిప్స్ ఫీజ్ రిఎగ్యాంబర్స్ మెంట్ అందించి పేద ప్రజల పిల్లలను ఆదుకోవాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు ఏష బోయిన సాంబయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం దానికి కొరకు ఎన్నో సంవత్సరాలు గా ప్రజలు ఉద్యమాల ద్వారా పోరాటం చేశారు ఎందరో పోరాట యోధులు అశువులు బాసారు సకల జనుల కల సాకార మైంది కాని దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కొమురం భీమ్ లాంటి వారు దొరల పాలనను ఎదిరించి ప్రాణాలు అర్పించి గ్రామాలనుండి పార దొలారు మనం సాధించు కున్న తెలంగాణ మళ్ళీ దొరల పాలైంది సకల జనులు పోరాడినప్పటికి రెండు వర్గాల చేతిలో తెలంగాణ రాష్ట్రం బంది గా మారింది ప్రాణాలు కోల్పోయారు దళిత బహుజన కులాలకు ఇది ఇప్పుడు శాపం గా మారింది విద్యా ఉద్యోగాలు వైద్యం పేదలకు అందని ద్రాక్ష గా మారింది పేదల సొంతింటి కల అరుంధతి నక్షత్రంలా కన బడుతోంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు ఎంతో కష్ట పడి కుటుంబాన్ని వదలి అప్పుల పాలై చదివిన చదువులు చట్ట బండ లైనాయి పేదలు దళిత బహుజనులు బ్రతకాలంటే ఓటుకు నోటు సంప్ర దాయాయం వదిలి బహుజన రాజ్యాధి కారాన్ని సాధించు కోవాలి రాబోయే ఎన్నికల్లో ప్రజా స్వామ్యాన్ని సాధించు కోవాలి దళిత బహుజనులారా ఏకం కావాలి సామాజిక తెలంగాణ సాధించు కోవాలి బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించే పార్టీలకు జై కొడుధాం అని సాంబయ్య యాదవ్ తెలిపారు . ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి s లక్ష్మి నారాయణ సామాజిక మహిళా న్యాయ వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భారతి కూరా కుల సామాజిక మహిళా న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాద్యాయ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మడే బిక్ష పతి, సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా కార్యదర్శి ప్రభాకర్, కుమ్మరి సంఘం ముదిరాజ్ పద్మ శాలి ముస్లిం యాదవ మహాసభ ఆదివాసీ మాల మహానాడు విశ్వ బ్రాహ్మణ తదితర సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *