రూ.2 కోట్ల నగదు లభ్యం
తెలంగాణఅక్షరం, హైదరాబాద్/ వనస్థలిపురం : నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు.యన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్‌ఓ మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Please follow and like us: