కమలాపూర్ టౌన్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి
మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి
తెలంగాణ అక్షరం-హుజురాబాద్
- హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఉన్న ఐదు మండలాలతో పాటు మరో నాలుగు మండలాలు, కమలాపూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి వీణవంక మండలంలోని చల్లురు, జమ్మికుంట మండలంలోని వావిలాల కమలాపూర్ మండలంలోని శనిగరం, ఉప్పల్ మండలాలతో పాటు కమలాపూర్ మున్సిపాలిటీ కేంద్రంగా మార్చడానికి గల కారణాలు, ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సహకరిస్తామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. గతంలో ఏనాడు కూడా ఈ సమస్యను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ దృష్టికి తీసుకురాలేదని, ఆయన పార్టీ మారి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ అన్నారు.
Please follow and like us: