పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు
తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామంలోని పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలు బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలీ కులానికి చెందిన మహిళలు, యువతులు బొనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు గంజి కుమారస్వామి, వార్డు సభ్యులు గంజి రాజు, గంజి రాజమణి-శ్రీనివాస్,మహేందర్, శంకర్, హేమంత్, బాబు, జగన్, కిరణ్, రాజమల్లు, చక్రపాణి, రవి వెంకటేశ్వర్లు, కుల సంఘం సభ్యులు, యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Please follow and like us: