తెలంగాణఅక్షరం-వీణవంక
ఈనెల 1న కరీంనగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో హామర్ త్రో విభాగం లో కమలాపూర్ బాలికల పాఠశాలకు చెందిన మౌటం సంగీత పదవ తరగతి విద్యార్థిని మూడవ స్థానం సాధించి కాంస్య పథకం విజేతగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇంచార్జ్ మండల విద్యాధికారి రామకృష్ణరాజు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో కాంస్య పథకం సాధించిన విద్యార్థినీతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుడు బండి కృష్ణమూర్తిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ తిరుపతిరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ వైనాల సుభాష్,ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా, పాఠశాల అధ్యాపక బృందం రంగనాథ్, రమేష్, సంజీవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పండరి, వాసు, రజిత, నీలాదేవి, సౌందర్య, సారయ్య, ఎఫ్ఎస్అలీ, హుస్సేన్ అలీ, రమ, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.