-
వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి
-
రెడ్డిపల్లిలో సుమారు రూ.50లక్షల పనుల ప్రారంభం
తెలంగాణ తెలంగాణ-వీణవంక
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సుమారు రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలు శుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠదామాలు, అలాగే ఊరికో ట్రాక్టర్ అందజేసి గ్రామాల్లోని చెత్తను సిబ్బంది ద్వారా తొలగించేలా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కావున రానున్న రోజుల్లో పల్లెలు అభివృద్ధి చెందాలంటో సీఎం కేసీఆర్ ను మూడో సారి సీఎంగా ఎన్నుకోవాలని, మండల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
-
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృది చేస్తానని రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. రెడ్డిపల్లి గ్రామంతో పాటు అనుబంధ గ్రామాలైన అచ్చంపల్లి, కొత్తపల్లి గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్సీ సహకారంతో రూ.50 లక్షల నిధులతో ప్రస్తుతం అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించేందుకు ప్రణాళికలు ఇప్పటికే చేపట్టామని, మంజూరు రాగానే అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మిభూమయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వార్డు సభ్యులు మాడ రవీందర్ రెడ్డి, చింతల రాజయ్య, అంబాల మధునయ్య, చింతల విజయ రాజు, ఉగ్గి మమతసమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, పోతుల సురేష్, పైడిమల్ల శ్రీనివాస్, చింతల సుమన్ తదితరులు పాల్గొన్నారు.