-
బతుకమ్మ చీరల పంపిణీలో వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక
మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం పని చేస్తోందని వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పోతుల నర్సయ్య అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు చీరలను అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టిన పిల్ల కాడి నుండి పండు ముసలమ్మ వరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కుటుంబ పెద్దలాగా తోడ్పాటు నందిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలు అందజేయడం లాంటి అనేక పథకాలు అందజేస్తూ అండగా ఉంటున్నాడని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రతీ ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో మనందరం సహకరించాలని, మహిళలందరూ కేసీఆర్ వెంటే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తిరుమల్ రావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మీభూమయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ చెకబండి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ మహిళలు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.