తెలంగాణ అక్షరం-వీణవంక
మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన మర్రి స్వామి యాదవ్ ను అఖిలభారత యాదవ్ మహాసభ మండల అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన రవి యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ ఉత్తర్వులను మండల కేంద్రంలోని బీరన్న ఆలయం ఆవరణలో మర్రి స్వామి యాదవ్ కు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అందజేశారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ.. యాదవుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, తెలంగాణ ప్రభుత్వం యాదవుల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న నూతనంగా నిర్మించే శ్రీకృష్ణ ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు యాదవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తన నియామకానికి కృషి చేసిన యాదవ సోదరులు, సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్ మండలాల అధ్యక్షులు, సంఘం నాయకులు గడ్డి రాములు యాదవ్, గిరివెన శ్రీనివాస్ యాదవ్, బద్దుల రాజ్ కుమార్ యాదవ్, రవీందర్ యాదవ్, ఇట్టవేన రాజయ్య యాదవ్, రమేష్ యాదవ్, చుక్కల శ్రీనివాస్ యాదవ్, గెల్లు కుమార్ యాదవ్, శివ యాదవ్, సంపత్ యాదవ్, రంజిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.