తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, సర్పంచ్ ఎం సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ లతశ్రీనివాస్, సర్పంచ్ సమ్మిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర అధ్యక్షుడు అప్పని హరీష్, ఉప సర్పంచ్ దుడపాక రాజ కొండయ్య, వార్డు సభ్యులు ఎజ్జు మహేందర్, కుండే హరీష్, ఎజ్జు శ్రీధర్, యారా రాజవ్వ, సమ్మయ్య, యార కొమల కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Please follow and like us: