- బీజేపీ మండల నాయకత్వం తీరు నచ్చక బండి సంజయ్ ముఖ్య అనుచరుడి రాజీనామా..
- జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
తెలంగాణఅక్షరం-వీణవంక (చల్లూరు)
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, ఆ పార్టీ అనుబంధ సంఘమైన భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షుడు, నారాయణదాసు గోపీకి ఆ పార్టీ మండల నాయకత్వం తీరు నచ్చక బీజేపీకి శనివారం రాజీనామా చేశారు. ఆ తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో చల్లూరు గ్రామంలో బలంగా ఉన్న బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి స్వగ్రామం కావడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లైందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే ఆ గ్రామంలోని 86వ పోలింగ్ బూత్ అధ్యక్షుడు గూడెపు శివ, ఉపాధ్యక్షుడు ఎదులాపురం రాము సైతం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. వీరు కూడా గోపితో పాటు బీజేపీలో చేరారు.
పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడం వల్లే రాజీనామా
బీజేపీలో ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే బీజేపీని వీడినట్లు గోపి ప్రకటించారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఇటీవల జరిగిన మార్పులతో బీజేపీలో పాత కర్యకర్తలకు గుర్తింపు లేదని వాపోయారు. పాత బీజేపీ కార్యకర్తలతో చేయించుకుంటూ కమిట్ తో పని చేసే కార్యకర్తలకు ఇవ్వకుండా సొంత వర్గానికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పదువులు ఇస్తున్నారని మండిపడ్డారు. చల్లూరులో జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు నాగిడి మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు దండి తిరుపతి, బొంగోని సదానందం, జీవన్, ఫసీయొద్దీన్, జక్కు నారాయణ, సంపత్ రెడ్డి, బొంగోని రాజయ్య, హరీష్, బార్గవ్, సది, రాము, రామ్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.