తెలంగాణఅక్షరం-వీణవంక
హైదరాబాద్ లోని సర్కస్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించే ముదిరాజ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొలిపాక తిరుమల్ ముదిరాజ్ కోరారు. మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని, ముదిరాజులకు ముదిరాజు బంధు ఇవ్వాలని, రూ.5లక్షల వరకు ఇన్సూరెన్స్, పింఛన్ విధానాన్ని అమలు చేయాలనే తదితర డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ సభకు ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మోటం వెంకటేష్,, ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (మెపా) తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారుడు గోనెల సమ్మయ్య, రాయణవేణి సంపత్, బేతిగల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొప్పరి సారయ్య, ఎల్బాక మాజీ అధ్యక్షుడు పోలు అర్జున్, కొలిపాక వెంకటేష్, వివిధ గ్రామాల ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.