అక్రమార్కులకు సహకరించిన సీఐ, ఎస్సై సస్పెండ్

తెలంగాణఅక్షరం- నర్మెట, జనగామ

భూ సమస్య విషయంలో బాధితులపై  అక్రమ కేసులు నమోదు చేసి బాధిత వ్యతిరేకులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ తగాదా విషయంలో ముప్పై సంవత్సరాలుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని  కేవలం ధరణి పోర్టల్ ఉన్నదనే సాకుతో పోలీస్ ద్వారా భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించెందుకు స్థానిక సర్కిల్ ఇన్స్ స్పెక్టర్, ఎస్.ఐ కబ్జాదారులకు సహాయ, సహాకారాలు అందజేయడంతో పాటు, బాధితులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీంతో బాధితులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు. బాధితులను ఇబ్బందులకు గురి చేశారని తేలడంతో సీఐ, ఎస్సై లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *