ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-
అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని చెక్ చేయాలి
-
ఎన్నికల అధికారులు, పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలి
-
కరీంనగర్ సీపి ఎల్ సుబ్బారాయుడు
తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట, కరీంనగర్
ఎన్నికల నియమాలన ప్రతి ఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సిపి ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్పోస్ట్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన రికార్డులను తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వదిలి పెట్టాలని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెంచాలని సూచించారు. అలాగే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాలు కావున నిఘా పెంచాలని పోలీసులను ఆదేశించారు. ఎన్నికలు ముగిసేంత వరకు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా రాజకీయ పార్టీలు ప్రజలు పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. గ్రామాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలను హుజురాబాద్ ఏసిపి ఎల్ జీవన్ రెడ్డి సిపి సుబ్బారాయుడికి వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్ సిఐలు కోరే కిషోర్, బి రమేష్, ఇల్లందకుంట, వీణవంక ఎస్సైలు నాంపల్లి రాజ్ కుమార్, ఎండి ఆసిఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.