- హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
- బ్రాహ్మణ పల్లిలో ఎన్నికల శంఖారావం పూరించిన కౌశిక్ రెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక, కరీంనగర్
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి బ్రాహ్మణపల్లి, మల్లన్న పల్లి ప్రజలను కోరారు. గ్రామంలో ఆయన బుధవారం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆయన ముచ్చటించారు. ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు అనేక సంక్షేమ పథకాలు అందజేసిందని, మళ్లీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని, కావున టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లుగా కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులు వస్తారని, వారు చెప్పే మాటలకు మోసపోవద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కల్వల ప్రాజెక్ట్కుకు శాశ్వత నిర్మాణం చెప్పట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు తీసుకొస్తానని చెప్పారు. అలాగే ప్రాజెక్టును మినీ మానేరు డ్యామ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రూ.1000 కోట్లు తీసుకొచ్చి సిరిసిల్ల సిద్దిపేట తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు బిజేపి నుండి బీ ఆర్ ఎస్లోలో చేరగా పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మునసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి మాడ సాధవరెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, శరత్ రెడ్డి, సమ్మిరెడ్డి, గాజుల రాజయ్య, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.