ఒక్కసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

  • ముఖ్య కార్యకర్తల సమావేశంలో

    ఎమ్మెల్సీ పాడి కౌశిక్  రెడ్డి

తెలంగాణఅక్షరం-వీణవంక

వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి, శ్రీరాములపేట, కొండపాక, పోతిరెడ్డిపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 49 రోజులు కార్యకర్తలు కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని సూచించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎం కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని, హుజురాబాద్ లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురబోతోందని స్పష్టం చేశారు. కావున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతీ ఒక్కరూ ఎలాంటి బేధాభిప్రాయం లేకుండా పార్టీ గెలుపు కోసం తోడ్పాటునందించాలని కోరారు.

బతుకమ్మ చీరలతో మహిళలు

హిమ్మత్ నగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సర్పంచ్ అంగడి రాధమ్మ, ఎంపీటీసీ నల్ల మమత మహిళలు బతుకమ్మ చీరలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డితో వారు ఫొటోలు దిగారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దసరా పండుగ సందర్భంగా మహిళలకు పుట్టింటి వారి కంటే ముందే చీరలను పంపిణీ చేయడంతో మహిళలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాలసాధవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి, సర్పంచులు పోతుల నర్సయ్య, ఆవాల అరుందతిగిరిబాబు, పంజాల అనూషసతీష్, ఎంపీటీసీలు ఒడ్డెపల్లి లక్ష్మీ భూమయ్య, నల్ల మమతతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు ఇట్టవేన రాజయ్య, నల్ల రవీందర్ రెడ్డి, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, చింతల సంపత్ రెడ్డి, కాసర్ల సుధాకర్, చెకబండి శ్రీనివాస్ రెడ్డి, దొండపాటి సంపత్ రెడ్డి, పైడిమల్ల శ్రీనివాస్, పోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *