-
ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మను పేర్చిన కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా వీణవంక, హుజురాబాద్, ఇల్లందకుంట ఎంపీపీలు ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, రాణిసురేందర్ రెడ్డి, సరిగొమ్ముల పావనీవెంకటేష్, హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వీణవంక వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్ తో పాటు వీణవంకకు చెందిన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం బతుకమ్మ ఆట ఆడి పాడారు. ఈ సందర్భంగా మహిళలు పాడిన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా శాలినీ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతో మమేకమైన బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ శ్రీదేవి కమలాకర్, తాళ్లపల్లి రాణి మహేందర్ గౌడ్ , పొనగంటి విజయలక్ష్మి మల్లయ్య, నీల లక్ష్మి, రాజేశ్వరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.