పీఏసీఎస్ సీఈవో ప్రకాష్ రెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వీణవంక పీఏసీఎస్ సీఈవో ప్రకాష్ రెడ్డి సూచించారు. మండలంలోని బేతిగల్, పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఆయన పీఏసీఎస్ సిబ్బందితో కలిసి సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకు రైతులందరీ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కావున రైతులందరూ మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సంపత్, రాజుకుమార్, హమాలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: