ఎమ్మెల్సీ పాడికి బహూకరించిన బేతిగల్ వాసి
తెలంగాణఅక్షరం-హుజురాబాద్
ఆపదలో తనను ఆదుకున్న ఓ వీరాభిమాని తన నాయకుడి చిత్రపటాన్ని తన రక్తంతోనే గీసి అందజేశాడు. దీంతో ఆ నాయకుడు తనపై ఇంత నమ్మకం పెంచుకుని తననే ఆశ్యర్యపరిచేలా తన చిత్రం గీసి అందజేయడంపై ఆయన ఒకింత సంతోషం వ్యక్తం చేస్తూ ఆశ్శర్యం వ్యక్తం చేశాడు. అంతేకాక చిత్ర పటం బహూకరణ చేస్తూ నమ్మిన నాయకుడితో ఫొటోలు, సెల్పీలు దిగి అభిమానీ ఆనందం వ్యక్తం చేశాడు. వివరాల ప్రకారం.. వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన రేణికుంట్ల ఠాగూర్ తన అభిమాన నాయకుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని తన రక్తంతో గీసి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో ఠాగూర్ కు ఓ సమస్య రావడంతో పలువురు నాయకులతో కలిసి తన సమస్యను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వద్ద చెప్పుకున్నాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ తన సమస్యకు పరిష్కారం చూపించాడు. దీంతో గతంలో తన సమస్యను ఏ నాయకుడికి చెప్పుకున్నా తీరకపోవడం, వెంటనే సమస్య పరిష్కారమవడంతో ఎనలేని ఆనందాన్ని పొందాడు. దీంతో తను తన రక్తంతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ ర డ్డి చిత్రపటాన్ని గీసి ఆయనకు అందజేశాడు. అలాగే కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించాడు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ స్నేహితులు బజ్జ రాజు, టోనీ, రాజు, భరత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.