ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఆయన మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతీ పథకం ప్రతీ ఇంటికి చేరిందని, ఆ ప్రభుత్వ పథకాలతో ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆరే ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. కావున అక్కడా, ఇక్కడా బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పని చేసినా అభివృద్ధి చేయలేదని, తనకు ఒక్క అవకాశం ఇస్తే రూ.1000 కోట్లతో అభివృదద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మహిళలతో డ్యాన్ చేసిన కౌశిక్ రెడ్డి
మండలంలోని రెడ్డిపల్లి, ఘన్ముక్ల గ్రామాల్లో మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా వారితో స్టెప్పులేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కాగా పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రచారానికి హాజరైన ప్రతీ ఒక్కరి దగ్గరికెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పోతుల నర్సయ్య, గంగాడి తిరుపతిరెడ్డి, బండ కిషన్ రెడ్డి, పర్లపల్లి రమేష్, కాంతారెడ్డి, పొదిల రమేష్, నాగిడి సంజీవరెడ్డి, ఒడ్డెపల్లి లక్ష్మీ భూమయ్య, చదువు మహేందర్ రెడ్డి, వీరారెడ్డి, పోతుల సురేష్, ఇట్టబోయిన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.