ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్
తెలంగాణఅక్షరం-వీణవంక
బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఈటల రాజేందర్ కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు జాతీయ ఎంబీసీ మరియు డీఎన్టీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఎంబీసీలకు ఏబీసీడీ వర్గీకరణకు బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామని అన్నారు. కావున ఎంబీసీలకు న్యాయం చేకూరుస్తున్నందున అన్ని వర్గాల సంక్షేమం కోసం తపన పడుతున్న ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ, డీఎన్టీల సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు ఓర్సు కృష్ణ ఒడ్డెర, తెలంగాణ సగర(ఉప్పర) సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏరుకొండ ప్రసాద్, కార్యదర్శి నలుబాల మురళీకృష్ణ, యువజన విభాగం నాయకులు కుర్మిండ్ల సంతోష్, ఎంబీసీ కులాల సంఘం రాష్ట్ర నాయకుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.