అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు 

  • జమునాస్టిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి 5వేలు అందజేసిన వంశీ రెడ్డి

హైదరాబాద్ : తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది . తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.టి టి ఏ వ్యవస్థాపకుడు పైళ్ల మల్లా రెడ్డి, సలహా కాన్సుల్ చైర్ విజయపాల్ రెడ్డి, సహాధ్యక్షులు మోహన్ పట్లోల్ల, సభ్యుడు భరత్ మదాడి ఆధ్వర్యంలో 2015 లో మొదలై , ప్రస్తుత ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది . ఈ కార్యక్రమంలో విద్య ద్వారా ఉపాధి మార్గాలు ,వ్యాపార వృద్ధితో ఆర్ధిక వనరుల అభివృద్ధి ,ఆధ్యాత్మిక ,ధార్మిక ,సాంస్కృతిక ,జాబ్ ఓరియెంటెడ్ ,ఉపాధి కల్పన,యూత్ ,మహిళా సాధికారత కోసం చేసే అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ అంతటా హైదరాబాద్ ,అచ్చంపేట ,నల్గొండ దేవరకొండ,బోనగిరి ,సిద్ధిపేట ,వికారాబాద్, యాదగిరిగుట్ట లలో ఉంటాయని తెలిపారు.ఈనెల 10నుండి 23 వరకు ఉన్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది ,సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి ప్రజలను కోరారు .అందులో భాగంగా ఈరోజు టి టి ఏ అధ్వర్యంలో లో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ గౌట్ స్కూల్ మాసబ్ టాంక్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత టి టి ఏ కమ్యూనిటీ సర్వీసెస్ చైర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నర్సింహ పెరుక వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ అన్ని తానై నిర్వహించిన నర్సింహ పెరుక ని ప్రసిడెంట్ వంశిరెడ్డికంచరకుంట్ల మరియు టి టి ఏ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. నిర్విరామంగా కృషి చేసే నర్సింహ పెరుక లాంటి సభ్యుల వల్లే తమ సంస్థ ఈ స్థాయికి చేరిందని ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల అన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర, టి టి ఏ సంఘం సభ్యులను సాదరంగా ” గాడ్ ఆఫ్ ఆనార్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. ఆనంతరం టి టి ఏ సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు.టి టి ఏ అధ్యక్షులు వంశీ రెడ్డి సభకు అధ్యక్షులు గా వ్యవహరించారు.స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది…చిరంజీవి హారిక పడిన “యెట్టగయ్య శివ శివ ” అనే పాట టి టి ఏ సభ్యులను ఆకట్టుకుంది. విద్యార్థిని కీర్తన “పాటమ్మ తోనే ” అనే పాట పాడారు. ఇద్దరికీ టి టి ఏ నుండి నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్,డెంటల్ కిట్స్,శానిటరీ పాడ్స్,ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ,ప్రతి ఒక్కరికీ ఫ్రూట్ ఇవ్వడం జరిగింది.. అమర దేవి అనే ఒక చిన్నారి జమునాస్టిక్ లో గోల్డ్ మెడల్ సాధించిందని తెలుసుకున్నా ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల 5వేల నగదు భహుమతి ఇచ్చి ఆశీర్వదించారు.రానున్నరోజుల్లో ఒలింపిక్స్ లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. వంశీ రెడ్డి మాట్లాడుతూ రేపటి దేశ భవిష్యత్తు ఈరోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు…అందుకే టి టి ఏ వారి ఆరోగ్యం, పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. డా:రచన డెంటల్ హెల్త్ గురించి పిల్లలకు సౌదరణంగా వివరించారు…డా మధులిక ఉమన్ హెల్త్ మరియు న్యుట్రిషన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 500మండి పిల్లలు పాల్గొన్నారు.ప్ర తిరోజూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *