తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఆసీఫ్ హెచ్చరిక
వీణవంకలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
తెలంగాణఅక్షరం-వీణవంక
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఎండీ ఆసీప్ హెచ్చరించారు. మండల కేంద్రం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుండి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు ఎక్కువ ధరకు విక్రియిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కడమంచి యాదగిరి, ఉబిది నరేష్, పర్థం అనిల్, పర్థం శ్రీనివాస్ లు బియ్యాన్ని తరలిస్తుండగా వారి వద్ద నుండి సుమారు 50 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు వారు తెలిపారు. కాగా వారిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దాడులల్లో డీటీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ నాగరాజు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.